ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సు….
గద్వాల రూరల్ జూన్ 07 (జనంసాక్షి):- మండల పరిధిలోని నీలహళ్లి గ్రామంలో రైతు వేదికలో హార్టికల్చర్ అధికారులు ఆయిల్ ఫామ్ వానకాలం సీజన్ లో సాగు చేయాల్సిన పంటలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈసదస్సుకు ముఖ్యఅతిథిగా హార్టికల్చర్ అధికారి శ్రీనివాస్ చారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు ఆవశ్యకత సాగు మెలకువలు గురించి రైతులకు వివరంగా పంటల సాగు, పంట దిగుబడులు,తదితర అంశాలపై గ్రామ రైతులకు వివరించారు. మండల వ్యవసాయ అధికారి శ్రీలత మాట్లాడుతూ…. వరి పంట నాటుపద్ధతి కాకుండా వెదచల్లే పద్ధతి సాగు చేయాలని అలాగే పచ్చిరొట్టె పంటలు భూమిలో కలిగే దున్నడం వలన భూస్వారం పెరుగుతుందని అన్నారు..ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఏవో శ్రీలత, ఏఈవో నరసింహులు, పంచాయతీ కార్యదర్శి రాధాగోపాల్ ,గ్రామ సర్పంచ్,శాంతమ్మ, ఎంపీటీసీ సరోజమ్మ, ఈరన్న, చిన్న హనుమంతు, రైతులు తదితరులు పాల్గొన్నారు.