ఆరవ రోజు రిలే నిరాహార దీక్షకు ముస్లిం మైనార్టీ సోదరుల సంఘీభావం

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 03 : ఎర్రవల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలో మండల సాధన సమితి అధ్యక్షులు పి. రాగన్న, ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి ఆధ్వర్యంలో ఆరవ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ఇలియాస్ మహమ్మద్ బికేయస్ ట్రేడర్స్, ఎర్రవల్లి పరిసర ప్రాంతాలకు చెందిన ముస్లిం సోదరులు అయూబ్, దౌలత్, రషీద్, బషీర్ మియా, ఆధ్వర్యంలో బుధవారం దీక్షను కొనసాగించారు. అనంతరం వారు మాట్లాడుతూ పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్రంలో అనేక మండలాలను విభజన చేయడం జరిగిందని, అందులో భాగంగానే ఎర్రవల్లి కూడా మండల కేంద్రంగా ప్రకటించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. మౌలిక వసతులు కలిగి ఉన్నందువలన పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా దీక్ష చేపట్టడం జరిగిందని వారన్నారు. అలాగే ముస్లిం మైనార్టీ సోదరులకు ఇటిక్యాల మండలం జెడ్పిటిసి హనుమంత్ రెడ్డి, జోగులాంబ ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, షేక్ పల్లి సర్పంచు రవీందర్ రెడ్డి మద్దతు తెలిపారు. దీక్ష కార్యక్రమంలో సయ్యద్ బాబు, షరీఫ్ పాషా, ఇస్మాయిల్, మక్బుల్, హలీం, అమీన్, భాష, షాలిమియా, వలి, రఫిక్, ఇలియాస్, బహుదూర్ తదితర మైనార్టీ సోదరులు పాల్గొన్నారు.

తాజావార్తలు