ఆరుతడి పంటలకు నీటివిడుదల పెంపు

నల్లగొండ,ఫిబ్రవరి20  ( జ‌నంసాక్షి)
: నాగార్జునసాగర్‌ ఎడమ కాల్వ కింద ఉన్న ఆరుతడి పంటలకు అవసరమైన మేరకు అధికారులు నీటి విడుదలను పెంచారు. పలుప్రాంతాల్లో ఇప్పటికీ పంటలు చేతికి రావాల్సిఉంది. సాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టులో వరిపంట పూర్తి కావడంతో ఆరుతడి పంటకు నీటిని విడుదల చేయాలని ప్రభుత్వం వారబందీ పద్ధతి నిర్ణయించింది. అందులోభాగంగా ఈ నెల 14వ తేదీన నీటి విడుదల నిలిపేశారు. ఎడమకాల్వ పరిధిలోని మేళ్లచెరువు జాతరకోసం కాల్వకు నీటిని విడుదల చేయాలని ప్రజలు కోరడంతో 16వ తేదీ నుంచి రోజుకు మూడు వేల క్యూసెక్కుల చొప్పున నీటివిడుదల చేశారు. వారబందీ నీటి విడుదలలోభాగంలో గంటకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున నీటివిడుదలను పెంచుతూ సాయంత్రానికి 8వేల క్యూసెక్కుల మేర విడుదల చేస్తున్నారు. ఆరుతడి పంటలను రక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.