ఆరుతడి పంటలకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్ బాబు..


నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్. ప్రస్తుత వర్షభావ పరిస్థితుల నేపథ్యంలో ఆరుతరి పంటలు పామాయిల్ తోటల ఏర్పటు తో మంచి ఆదాయం పొంద వచ్చు అని నేరేడుచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్ అన్నారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్ మాట్లాడుతూ రైతుల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా
పని చేయాలని డైరెక్టర్స్ ను కోరారు. ఆరుతడి పంటలకు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని కావలసినవారు అగ్రికల్చర్ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం పామాయిల్ తోటలు ఏర్పాటు చేసే వారికి సబ్సిడీ అందిస్తుందని ఎస్టి రైతులకు ఒక ఎకరం పామాయిల్ తోట ఏర్పాటుకు 100% సబ్సిడీతో 45 వేలు ఇస్తుందని ఎస్సీ రైతులకు 90% సబ్సిడీతో బీసీ రైతులకు 80% సబ్సిడీతో ఓసి రైతులకు 70% సబ్సిడీ అందిస్తుందని కావలసినవారు సంప్రదించగలరని చెప్పారు.
పాలకీడు మండలం బొత్తలపాలెం గ్రామంలో రైతు దాతగా అందించిన ఒక ఎకరం స్థలంలో 5,000 మెట్రిక్ టన్నుల గోడౌన్ ఏర్పాటుకు ప్రపోజల్ పంపినట్లు తెలిపారు. మార్కెట్ కి ఆదాయం పెంచుకునేందుకు రోడ్డు పక్కన ఉన్న స్థలంలో 6 వాణిజ్య దుకాణాల ఏర్పాటుకు ప్రపోజల్ పంపినట్టు తెలిపారు. జాతీయ రహదారి విస్తరణలో చిల్లె పల్లి చెక్ పోస్ట్ తొలగించినందున కొత్త చెక్పోస్ట్ కట్టుకునేందుకు ప్రపోజల్ పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సోమగానీ మురళి, డైరెక్టర్స్
నాగార్జున, బానోతు బాలు,మహమ్మద్ రఫీక్, పాపయ్య, నూకల రాంరెడ్డి,అందే లక్ష్మీనారాయణ, జాన్ రెడ్డి, సైదులు, గంట జ్యోతి,తదితరులు పాల్గొన్నారు.