ఆరు గ్యారంటీలను అటకెక్కించారు

` కాంగ్రెస్‌పాలనలో అరెస్టులు, ఆంక్షలు, బూటకపు ఎన్‌కౌంటర్లు
` హరీశ్‌రావు
హైదరాబాద్‌(జనంసాక్షి): కాంగ్రెస్‌ పాలనలో అరెస్టులు, ఆంక్షలు, బూటకపు ఎన్‌కౌంటర్లు జరుగుతున్నాయని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. అరెస్టులు, బూటకపు ఎన్‌కౌంటర్లు అశాంతి రేపుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏడాది విజయోత్సవాలను నిర్వహిస్తుంటే ఈ పద్ధతి ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్‌’ వేదికగా పోస్టు చేశారు. అన్ని వర్గాలను మోసగించి 6 గ్యారంటీలను అటకెక్కించారనని మండిపడ్డారు. ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొట్టి.. దానికీ తూట్లు పొడిచారని హరీశ్‌రావు (ఃఖీూ) ఎద్దేవా చేశారు.