ఆరు నూరైన ఛలో అసెంబ్లీ జరుగుతుంది
హైదరాబాద్,(జనంసాక్షి): ఆరు నూరైన ఛలో అసెంబ్లీ జరిపి తీరుతామని ఎమ్మెల్యేలు గుండా మల్లేష్, ఈటెల రాజేందర్, యెండల లక్ష్మీనారాయణ గురువారం హైదరాబాద్‌లో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే ఎమర్జెన్సీ పరిస్థితులు తలపిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. సభలో సమావేశాలకు ఆటంకం కలిగించడం లేదని. అలీగే ప్రజా సమస్యలపై చర్చించడానికి తామేమి వ్యతిరేకం కాదని వారు ఈ సందర్బంగా తెలిపారు.