ఆరు నెలల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు నిర్వహించండి-హైకోర్టు తీర్పు

2

హైదరాబాద్‌,ఏప్రిల్‌27(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల నిర్వహణ లో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట దక్‌ఇకంది. గ్రేటర్‌ ఎన్నికలపై ఉన్నత న్యాయస్థానం సోమవారం తీర్పు వెలువరించింది. డిసెంబరు 15నా టికి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఎన్ని కల నిర్వహణకు హై కోర్టు 6నెలల గడువు ఇచ్చింది. 6 నెలలకు మించి సమయం అడిగిన ప్రభు త్వ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది.అయితే డిసెంబర్‌ కల్లా ఎన్నికలు నిర్వ హిస్తామని ఇప్టపికే ప్రభుత్వం ప్రకటించి ఉన్నందున ఈ గడువు సరిపో తుందని ప్రభుత్వ వరగ్‌ఆలు భావిస్తు న్నాయి. ఓ రకంగా ఇది తమకు వెసలు బాటు ఇచ్చినట్లేనని భావిస్తున్నారు. అయితే  సింగపూర్‌ కంటే హైదరాబాద్‌ పెద్దదైనందున ఎన్నికలకు సమ యం కావాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా …

ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నందున అదనపు సమయం సరికాదని కోర్టు స్పష్టం చేసింది. అక్టోబరు 31లోగా వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల పక్రియ పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. అక్టోబరు 31 తర్వాత నెలన్నర సమయం కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం హైకోర్టును కోరింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికలు  డిసెంబర్‌ 15 నాటికి ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు ఆరు నెలల గడువు ఇచ్చింది. ఆరు నెలలకు మించి గడువు అడిగిన ప్రభుత్వం వాదనను కోర్టు తోసిపుచ్చింది. సింగపూర్‌ కంటే హైదరాబాద్‌ పెద్దదైనందున ఎన్నికల నిర్వహణకు సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఇప్పటికే ప్రత్యేకాధికారుల పాలనలో ఉన్నందున అదనపు సమయం సరికాదన్నారు. అక్టోబర్‌ 31లోగా వార్డుల పునర్విభజన పక్రియ పూర్తి చేయాలని కోర్టు తెలిపింది.  కాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలను పదేపదే జాప్యం చేయడంపై హైకోర్టు సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. ఎన్నికలు విూరు నిర్వహిస్తారా, లేదా మమ్మల్ని జోక్యం చేసుకొమ్మంటారా అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. పలుమార్లు వాయిదా అనంతరం గ్రేటర్‌ ఎన్నికలపై హైకోర్టు తుదితీర్పును వెల్లడించింది.