ఆరు భాషల్లో పీఎంవో

2

– తెలుగులో కూడా అందుబాటు

న్యూఢిల్లీ,మే29(జనంసాక్షి): ప్రధానమంత్రి కార్యాలయానికి సంబంధించిన వివరాలతో కొత్త వెబ్‌సైట్‌ ప్రారంభమైంది. మొత్తం ఆరు భాషలతో దీనిని రూపొందించారు. భారత విదేశాంగ మంత్రి

సుష్మా స్వరాజ్‌ ఆదివారం దీనిని ప్రారంభించినట్లు అధికార వర్గాల సమాచారం. గతంలో మాదిరిగా కాకుండా ఇప్పటి నుంచి బెంగాలీ, గుజరాతి, మరాఠీ, మలయాళం, తమిళం, తెలుగు భాషల్లో ఇక నుంచి పీఎంవో వెబ్‌ సైట్‌ అందుబాటులో ఉంటుంది.’ప్రధాని నరేంద్రమోదీ కార్యాలయం ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూడాట్‌పీఎంఇండియాడాట్‌ గవ్‌డాట్‌ఇన్‌ మొత్తం

ఆరు ప్రాంతీయ భాషల్లో లభించనుంది’ అని ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఆయా ప్రాంతీయ భాషలకు చెందినవారికి దగ్గరయ్యేందుకు ప్రధాని చేసే ప్రయత్నాల్లో భాగంగా ఇది కూడా ఒకటి అంటూ ఈ సందర్భంగా సుష్మా చెప్పారు.