‘ఆరు యూనివర్సిటీలు, 69కాలేజీల్లో వైఫై’

e0s86nk9బెర్హంపూర్: ఆరు విశ్వవిద్యాలయాలు, 69కాలేజీల్లో వైఫై సౌకర్యం కల్పించేందుకు ఒడిషా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వైఫై (వైర్‌లెస్ ఫెసిలిటీ) సౌకర్యానికి ప్రభుత్వం రూ.20 కోట్లను కేటాయించిందని ఉన్నత విద్యాశాఖ మంత్రి ప్రదీప్ కుమార్ తెలిపారు. వైఫై సాకర్యం 46 ప్రభుత్వ కాలేజీలు, 23 ప్రవేట్ కాలేజీల్లో అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు. విద్యాసంస్థల్లో స్మార్ట్ క్లాస్‌రూమ్స్, ఈ-లైబ్రరీ,కమ్యూనికేషన్ కం లాంగ్వేజ్ లాబరేటరీస్ సౌకర్యాలను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో వైఫైను ప్రవేశపెడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. వైఫై సౌకర్యం వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు కానుందని తెలిపారు.