ఆరు రోజుల్లో రూ. 120 కోట్లు!
ముబంయి: దీపావళి సందర్భంగా విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘జబ్ తక్ హై జాన్’ తొలి ఆరు రోజుల్లోనే బాక్స్ ఆఫీసు వద్ద రూ. 120 కోట్లు వసూలుచేసి రికార్డులు సృష్టిస్తోంది. భారత్‌లో 80.73 కోట్లు సంపాదించిన ఈ చిత్రం విదేశాల్లో మరో నలబై కోట్లు వరకూ సంపాదించినట్లు బాక్సాఫీను వర్గాలు తెలిపాయి. షారుక్ ఖాన్, కత్రినా కైఫ్, అనుష్కా శర్మలు నటించిన ‘జబ్ తక్ హై జాన్ ‘ సినిమా ఇటీవల కన్నుమూసిన ప్రముఖ దర్శక నిర్మాత యశ్ చోప్రా చివరి చిత్రం.