ఆరు విద్యాసంస్థలకు ‘విశిష్ట’ హోదా

– హోదా పొందిన వాటిల్లో మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేట్‌ విద్యా సంస్థలు
న్యూఢిల్లీ, జులై 9(జ‌నం సాక్షి) : దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన ఆరు విద్యాసంస్థలకు కేంద్ర మానవ వనరుల శాఖ ‘విశిష్ట’ ¬దా కల్పించింది. మూడు ప్రభుత్వ, మూడు ప్రైవేటు విద్యాసంస్థలకు ఈ ¬దా కల్పించినట్లు మానవ వనరులశాఖ ప్రకాశ్‌ జావడేకర్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ప్రభుత్వ రంగానికి చెందిన ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ బాంబే, ఐఐఎస్‌సీ బెంగళూరు, ప్రైవేటు సంస్థలైన మణిపాల్‌ అకాడవిూ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌, బిట్స్‌ పిలానీ, జియో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ రిలయన్స్‌ ఫౌండేషన్‌కు ఈ ¬దాను కల్పించారు. ‘విద్యాసంస్థలకు ‘విశిష్ట’ ¬దా అనేది దేశానికి చాలా ముఖ్యమని, మన దేశంలో 800 విశ్వవిద్యాలయాలు ఉన్నాయన్నారు. కానీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌ 100, టాప్‌ 200లో ఒక్క యూనివర్శిటీ కూడా చోటు దక్కించుకోలేదని, ఈ ¬దా యూనివర్శిటీ ర్యాంకింగ్‌ మెరుగుపడేందుకు తోడ్పడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. ఈ నిర్ణయంతో విద్యాసంస్థలకు పూర్తి స్వయంప్రతిపత్తి అధికారాలు లభిస్తాయని, విద్యాసంస్థలు సొంతంగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఈ సంస్థలకు వచ్చే ఐదేళ్లలో రూ.1,000 కోట్ల నిధులు లభిస్తాయని, ఇక ప్రతి విద్యార్థి స్కాలర్‌షిప్‌లు, ఫీజు మినహాయింపు తదితర సదుపాయాలతో కూడిన ఉన్నత విద్యావకాశాలను పొందగలరని జావడేకర్‌ తెలిపారు.