ఆరోగ్యమే మహాభాగ్యం .. ప్రభుత్వ పాఠశాలల్లో యోగా శిబిరాలు
బాన్సువాడ, జనంసాక్షి(జూన్ 21):
మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే లక్ష్యాలను చేరుకుంటాడని, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగాసనాలు చేసినట్లైతే ఎలాంటి రోగాలు దరిచేరవని ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ అన్నారు. బాన్సువాడ మండలం బోర్లమ్ గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా శిబిరం నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చిన్నా పెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోజు యోగాసనాలు చేయాలని, దైనందిన జీవితంలో యోగా దినచర్యగా మారితే మనిషి జీవన ప్రమాణాలు పెంచుతాయని అన్నారు. నిత్య సాధన చేసినట్లైతే దీర్ఘకాలిక వ్యాధులు నుంచి ఉపశమనం పొందవచ్చని అన్నారు.