ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా తప్పనిసరి జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి

గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్(12): ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగ, ధ్యానం, వ్యాయామం, వంటి ఆహార నియమాలు పాటిస్తే మానవుడు సంపూర్ణ ఆరోగ్యం గా జీవించాలంటే ప్రతి మానవునికి యోగా తప్పనిసరి అని జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి అన్నారు. మండలంలోని పోలికే పహాడ్ గ్రామంలో సోమవారం విశ్వ మానవత సంస్థ ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన రిటైర్డ్ జిల్లా విద్యాధికారి డాక్టర్ మంద మోహన్ రెడ్డి సహకారంతో గ్రామంలో ఉచిత హోమియోపతి చికిత్స శిబిరం ఏర్పాటు చేశారు డాక్టర్ జోష్న ఆధ్వర్యంలో వంద మంది కి పైగా రోగులకు పరీక్షలు చేసి వారికి కావాల్సిన మందులను ఉచితంగా అందజేశారు ఈ శిబిరాన్ని జడ్పీ చైర్మన్ ప్రారంభించి యోగాసనాల క్యాలెండర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ధ్యానం వ్యాయామం వల్ల ఉపయోగాలపై గ్రామస్తులకు వివరించారు గ్రామంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు సహకారం అందిస్తున్న డాక్టర్ మోహన్ రెడ్డి, మానవతా సంస్థ వ్యవస్థాపకులు అల్లూరి శ్రీనివాస్ ను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు మంద కోటేశ్వర్ రెడ్డి, సంస్థ సభ్యులు బేతం రామాంజ రెడ్డి, తిరుపతమ్మ, శ్రీనివాసులు, త్రివేణి, రాజేశ్వరి, రామాంజనేయులు, చల్మన్ తదితరులు పాల్గొన్నారు