ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు
ప్రజలందరూ చిన్న ఆరోగ్య సమస్య కలిగిన వెంటనే వైద్యులను సంప్రదించాలి.
ఎమ్మెల్యే చొరవతో ప్రత్యేక చర్యలు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్.
తాండూరు అక్టోబర్ 15(జనంసాక్షి)ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదని ప్రజలందరూ ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా.. వెంటనే వైద్యులను సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రాజు గౌడ్ అన్నారు. యాలాల మండలం జుంటుపల్లి గ్రామంలో గత రెండు రోజులుగా గ్రామస్తులు చాలామంది నీళ్ల విరేచనాలు, వాంతులతో బాధపడుతుం డటం తో జిల్లా, మండల ఆరోగ్యశాఖల సమన్వయం తో వైద్య క్యాంపులు నిర్వహించి గ్రామస్తులకు వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్ ఎంపీపీ బాలేశ్వర్ గుప్తా తో కలిసి ఆరోగ్య వైద్య శిబిరాన్ని సందర్శించి రోగులకు భరోసా అందించారు. వైద్యులతో పరిస్థితిలను సమీక్షించి తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలను సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితి పై ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రత్యేక చొరవ
ప్రజలందరూ కాచి వడగట్టిన నీటిని మాత్రమే తాగాలని సూచించారు.వాంతులు విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని తెలిపారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.వైద్యశాఖ తదితర శాఖల సమన్వయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తున్నామని పేర్కొన్నారు.పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.గ్రామంలో కాశమ్మ అనారోగ్య కారణాలవల్లమరణించినట్లు వైద్యులు తెలుపుతున్నారు.బాధిత కుటుంబానికి అండగా ఉంటామన్నారు.
గ్రామంలో ఎక్కడ మురికి నీరు చేరకుండా, నిలువ ఉండకుండా తగిన చర్యలు చేపట్టామని
తెలిపారు.జిల్లా వైద్య యంత్రాంగం మొత్తం అనారోగ్యానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
త్వరలోనే పరిస్థితి అదుపులోకి వస్తుందన్నారు.
ప్రజలందరూ తప్పకుండా వైద్యులు అందించే ట్యాబ్లెట్లను వాడాలని విజ్ఞప్తి చేశారు.
అనంతరం అనారోగ్యంతో మృతి చెందిన కాశమ్మ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.
2 Attachments • Scanned by Gmail