ఆరోగ్య రథాలకు సిఎం చంద్రబాబు పచ్చజెండా
గ్రావిూణ ప్రాంతాల్లో సేవలు అందించనున్న వాహనాలు
అమరావతి,మే31(జనం సాక్షి): మారుమూల ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. రెండు ఆరోగ్య రథాలను సిద్ధం చేసింది.మారుమూల ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం రెండు ఆరోగ్య రథాలను ప్రవేశపెట్టింది. 90 లక్షల విలువైన ఈ రెండు ఆరోగ్య రథాలను సీఎం చంద్రబాబు తన నివాసమైన ఉండవల్లిలో ప్రారంభించారు. జెండా ఊపి ఆరోగ్య రథాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలో ప్రారంభించారు. సీలేరు, కడప జిల్లాల్లో ఈ ఆరోగ్యరథాలు ప్రజలకు వైద్యసేవలు అందించనున్నాయి. ఇందులో ఉచితంగానే రోగులకు మందులు, వైద్యపరీక్షలు నిర్వహించనున్నారు. కార్పొరేట్ సర్వీసు రెస్పాన్స్‌బిలిటీ నిబంధన కింది ఏపీ జెన్‌కో 90లక్షలు సమకూర్చింది. ఈ రెండు ఆరోగ్య రథాలలో ఒక వాహనాన్ని సీలేరు.. మరో వాహనాన్ని కడప జిల్లాకు కేటాయించారు. ఈ ఆరోగ్య రథాలతో వివిధ రోగాలకు సంబంధించిన 150 వైద్య పరీక్షలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేశారు. ఈసీజీ, రక్తపరీక్షలు, ఐదు పెరావిూటర్ మానిటరింగ్ సిస్టం, నీరుడు పరీక్ష, నెబురైజర్, హార్ట్‌ఎటాక్ వచ్చిన రోగికి వైద్య సేవలు అందించి.. ప్రమాదం నుంచి రక్షించుటకు తగిన సౌకర్యాలు ఈ ఆరోగ్య రథాలలో ఏర్పాటు చేశారు.
ఉచితంగా రోగులకు మందులు ఆరోగ్య రథాలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఆయా గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందిస్తాయి. ఈ రథాలలో ఒక మెడికల్ ఆఫీసరు, ఫార్మాసిస్ట్ స్టాఫ్‌నర్సు, టెక్నీషియన్ ఉంటారు. రోగులకు అవసరమైన మందులను ఉచితంగానే అందజేయనున్నారు. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూలాంటి వ్యాధులకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. కేన్సర్‌లాంటి వ్యాధులను తొలిదశలోనే గుర్తించి.. ఎన్టీఆర్ వైద్యసేవ ఆసుపత్రులకు పంపిస్తారు. రోగులకు సంబంధించిన వివరాలను ఎలక్టాన్రిక్ మెడిక్ రికార్డులో అఎ/-లోడ్ చేసి రోగి ఆధార్‌కార్డును అనుసంధానం చేస్తారు. ఆరోగ్య రథాలకు ఒక్కోదానికి అదనంగా 3 అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. గిరిజన ప్రాంతాల ప్రజలు ఎవరైనా పీహెచ్‌సీకి రాలేనివారు ఉంటే..ఈ అంబులెన్స్‌లు ఆయా గ్రామాలకు పంపి ఇంటి వద్దనే ఉచిత సేవలు అందిస్తుంది.