*ఆరోపణలను ఖండించిన దుర్గ ప్రసాద్*
* విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన దివ్యాంగులు
కాప్రా జవహర్ నగర్ ( జనం సాక్షి ) అక్టోబర్ 13 :- చైర్మన్ వాసుదేవ రెడ్డి పై వచ్చిన అరోపణలను తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి, రాష్ట్ర నాయకులు మోనార్ దుర్గ ప్రసాద్ తీవ్రంగా ఖండించారు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నోబెల్ హై స్కూల్ సమీపంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా మొనార్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ గా వాసుదేవ రెడ్డి తెలంగాణా ఉద్యమంలో అనేక లాటి దెబ్బలు భరించి అనేక సార్లు వరంగల్ సెంట్రల్ జైల్లో గడిపిన ఉద్యమ దీరుడు వాసుదేవ రెడ్డి అని అన్నారు
ఆనాడు తెలంగాణ ఉద్యములో మొక్కవోని ధైర్యంతో ఒక దివ్యంగుడిగా ఉండి కూడా సకలాంగుల ఉద్యమానికి నాయకత్వం వహించడం వికలాంగులకు ఒక స్ఫూర్తిదాయకమని అలాంటి ఉద్యమ కారునిపై ఇష్టం వచ్చినట్లు ఆరోపనలు చేయడం వికలాంగుల సమాజాన్ని ఉద్యమకారులను కించపరచడమే అవుతుందని తక్షణమే చైర్మన్ వాసుదేవ రెడ్డికి వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు వికలాంగులు వికాలంగులను విమర్శించుకోవడం మన గౌరవాన్ని మనం తగ్గించుకోవడం తప్ప మరొకటి కాదని విజ్ఞప్తి చేశారు
వికలాంగుల సంక్షేమ శాఖ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని గత 2 సంవత్సరాలుగా వికలాంగుల సంక్షేమశాఖ డైరెక్ట్ శైలజ పై సోషల్ మీడియా, వివిధ దిన పత్రికల్లో జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలు బయట పెట్టాలని ఈ ప్రచారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ధ్వజమెత్తారు వికలాంగుల సంక్షేమ శాఖలో జరుగుతున్న ఘటనలు అధికారుల నిర్లక్షం వికలాంగుల పాలిట శాపంగా మారుతుందని వికలాంగుల సంక్షేమ శాఖలో అవకతవకలు అక్రమాలు జరిగాయనే ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి నాయకులు హెచ్చరించారు వికలాంగుల సంక్షేమ శాఖలో అవకతవకలు జరిగాయని జరుగుతున్న ప్రచారంపై వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , స్పెషల్ సెక్రెటరీ దివ్యదేవరాజన్ వెంటనే జోక్యం చేసుకొని వాస్తవాలు బయటపెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ దివ్యాంగుల నాయకులు భక్త చారి,శంకర్, నాగరాజు, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
Attachments area