ఆర్టీఏ తనిఖీలు
10 ప్రైవేటు ట్రావెల్స్ వాహనాలపై కేసులు
హైదరాబాద్: విజయవాడ జాతీయ రహదారిపై ఎల్బీనగర్ వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న పది ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. ఇందులో సీవీఆర్, శ్రీ అంజనేయ, కాళేశ్వరి, కేశినేని ట్రావేల్స్‌కు చెందిన బస్సులు ఉన్నట్లు ఆర్టీఏ అధికారులు తెలిపారు.