ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్
హైదరాబాద్, జనంసాక్షి: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో మరోసారి సమ్మె సైరన్ మోగింది. 17 వేల మంది ఆర్టీసీ కాట్రాక్టు కార్మికుల క్రమబద్దీకరణ, ఇతర దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ఎంప్లాయీస్ యూనియన్, తెలంగాణ మజ్దూర్ యూనియన్ సంయుక్తంగా సోమవారం ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చాయి.
సమస్యల పరాష్కారానికి అన్ని రకాలుగా ప్రయత్నించామని, ఫలితం లేకపోవడంతో సమ్మెకు దిగాలని నిర్ణయానికి వచ్చినట్లు ఇరు సంఘాలు తెలిపాయి. జూన్ 10లోపు తమ సమస్యలను పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని యూనియన్ నేతలు హెచ్చరించారు.