ఆర్టీసీ కార్మికసంఘాలతో చర్చలు విఫలం
హైదరాబాద్ : ఆర్టీసీలో తమ డిమాండ్ల సాధనకు సమ్మె నోటీసు ఇచ్చిన కార్మిక సంఘాలతో బస్‌భవన్‌లో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఒప్పంద కార్మికుల సర్వీసుల క్రమబద్ధీకరణ, వేతన సవరణలపై ఎటువంటి హామీ ఇవ్వలేదని ఈయూ, టీఎంయూ సంఘ నేతలు వెల్లడిరచారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మెకు దిగుతామని వారు ప్రకటించారు.