ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవే:మధు

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవని సీపీఎం ఎపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. ఈమేరకు మధు.. సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు. ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఫిట్ మెంట్ కోరడం సబబే అని చెప్పారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని కోరారు. ఆర్టీసీ సంస్థ వ్యాపార సంస్థ కాదని చెప్పారు.