ఆర్టీసీ ద్వారా దోపిడీకి మార్గాలు వెదుకుతున్నారు. తెదేపా

హైదరాబాద్‌: ఆర్టీసీ ద్వారా పేద ప్రజలను దోచుకునేందుకు ప్రభుత్వం అన్ని మార్గాలూ అన్వేషిస్తోందని తెదేపా నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు ఆరోపించారు. బస్సులు, పరికరాల కొనుగోళ్లలో అవినీతి తీవ్రస్థాయిలో రాజ్యమేలుతోందని ఆయన ఆరోపించారు. ఏపీపీఎస్సీని రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మార్చేశారని మరో నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఏపీపీఎస్సీ సభ్యులందరిపైనా ఏసీబీ విచారణ జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీపీఎస్సీలో ప్రస్తుతం ఉన్న సభ్యులను తొలగిస్తే అర్హులైన నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందని, అక్కడ ప్రస్తుతం వెలుగు చూస్తున్న అక్రమాలన్నింటికి వైఎస్స్‌ ప్రధమ సూత్రధారి అని మోత్కుపల్లి అన్నారు.