ఆర్టీసీ బస్టాండ్ ను పరిశీలించిన జెడ్పిటిసి మనోహర్ రెడ్డి
నాగిరెడ్డిపేట్: 21 సెప్టెంబర్ జనం సాక్షి నాగిరెడ్డి పెట్ మండల కేంద్రంలోని ఆర్ టి సి బస్టాండ్ ను జెడ్పిటిసి ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి బుధవారం స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఆర్టీసి బస్టాండ్ పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, బస్టాండ్ లోపలికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ప్రధాన రహదారిపై నిలబడి బస్సుల కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడిందని స్థానిక ప్రజా ప్రతినిధులు జెడ్పిటిసి మనోహర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బుధవారం జడ్పిటిసి మనోహర్ రెడ్డి ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసి బస్టాండ్ గురించి ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నూతన బస్టాండ్ నిర్మాణానికి నిధులు మంజూరు అయ్యేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపేట ఎంపిటీసి మాధవి సంతోష్ గౌడ్, సర్పంచులు బిట్ల మురళి, ప్రవీణ్ కుమార్, నాయకులు పర్వత్ రావు, సాయిలు తదితరులు ఉన్నారు.