ఆర్టీసీ సమ్మెపై కేబినెట్ సబ్ కమిటీ వేసిన టీసర్కార్

హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులతో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ముగిసింది. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. ఆర్టీసీ సమ్మెపై కేబినెట్ సబ్ కమిటీ వేశారు. మంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి నేతృత్వంలో ఈటెల రాజేందర్, మహేందర్ రెడ్డి సభ్యలుగా కమిటీ ఏర్పాటు చేశారు. సమ్మెపై అన్ని వర్గాలతో చర్చించి.. వీలైనంత త్వరగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ పేర్కొన్నారు. సమావేశంలో టిఎంయూ, ఈయూ సంఘాల నేతలతు పాల్గొన్నారు. తమకు 43 శాతం ఫిట్ మెంట్ ఇవ్వాలని కార్మిక సంఘాలు కోరాయి.