ఆర్థికంగా తెలంగాణ బలపడుతోంది

2

– మంత్రి ఈటల రాజేందర్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌ 7 (జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా బలపడుతోందని ఆర్థికశాఖమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. సోమవారం ఆదాయాన్ని అర్జించే శాఖల  కార్యదర్శులతో  మంత్రి ఈటల రాజేందర్‌ సచివాలయంలోని డి బ్లాక్‌ లో  సవిూక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశంలో  రెవెన్యూ,ఎక్సైజ్‌,కమర్షియల్‌ టాక్స్‌, రవాణా, అటవీ,స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌, మైనింగ్‌ శాఖల కార్యదర్శులు  పాల్గొన్నారు. ఈ సందర్భరంగా మంత్రి ఈటల మాట్లాడుతూ అన్ని రంగాల్లో రెవెన్యూ పెరుగుదల కనిపించిందని హార్షం వ్యక్తం చేశారు.

నవంబర్‌ చిరవకల్లా సుమారు 21000 కోట్ల రూపాయాల ఆదాయాన్ని అర్జించినట్టు సవిూక్షలో తేలింది.గత ఏడాదితో పోలిస్తే దేశంలోనే అత్యధికంగా అన్ని రంగాల్లో అభివృద్ది రేటు కనిపించిందని మంత్రి చెప్పారు.

శాఖల వారీగా ఆదాయం వివరాలు:

వ్యాట్‌,సేల్స్‌ టాక్స్‌ లో గత ఏడాదితో పోలిస్తే 18శాతం పెరుగుదల కనిపించింది

ఎక్సైజ్‌ శాఖలో 3320 కోట్లు రూపాయలు ఆదాయం ఇది గత 2014-15 ఏడాదితో పోలిస్తే 18శాతంగా ఉంది.

స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేష్‌ లో 30శాతం ఆదాయం  పెరుగుదల కనిపించింది.

రవణాశాఖాలో 1460 కోట్ల ఆదాయం …ఇది గత ఏడాదిలో పోలిస్తే ఇది 20శాతం వృద్ది .

2016-17 బడ్జెట్‌ కు అన్ని శాఖలు సంసిద్దం కావాలి

ఆదాయం  పెరగటంపై హర్షం వ్యక్తం చేస్తూనే  రానున్న 2016-17 బడ్జెట్‌ కు అన్ని శాఖలు సంసిద్దం కావాలని మంత్రి ఈటల రాజేందర్‌  కోరారు . అమ్మకం పన్ను,వృత్తి పన్ను( ప్రోఫెషనల్‌ టాక్స్‌), పన్ను చెల్లించకుండా పక్కరాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి కోరారు.మైనర్‌ మినరల్స్‌ లీజ్‌ లను సులభతరం చేయాలని,పక్క రాష్ట్రాల నుంచి వస్తున్న ఇసుక రవాణాపై దృష్టిపెట్టాలని మంత్రి అధికారులను కోరారు.ఏడాది పాటు పూర్తి  పన్నుల ఆదాయం, ఖర్చుల ఆదారంగా తయారవుతున్న మొదటి బడ్జెట్‌ 2016-17 బడ్జెట్‌ అని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు.