ఆర్థికపరిస్థితి సవాల్‌గానే వుంది: చిదంబరం
ముంబయి: దేశంలో ఆర్థికరంగంపరిస్థితి ఇంకా సవాల్‌గానే వుందని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం అన్నారు. పెట్టుబడులను ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని ఆయన పేర్కొన్నారు. నిఫ్టీ సూచీ కుప్పకూలడంపై ఎస్‌ఎస్‌ఈ దర్యాప్తు జరువుతోందని ఆయన వెల్లడించారు. బీమా, పింఛను రంగాలకు చెందిన బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.