ఆర్థిక అవసరాలకు ఆసరా : ఎంపీపీ కరణం అరవింద్ రావ్
పరిగి రూరల్, సెప్టెంబర్ 20 ( జనం సాక్షి ) :
ఆర్థిక అవసరాలకు ఎవరినీ అడగకుండా తమ కాళ్లపై నిలబడేలా సీఎం కేసీఆర్ వృద్దులు, విభిన్న ప్రతిభావంతులు, డయాలసిల్ పేషెంట్లకు పింఛన్లు పంపిణీ చేయడం నిజంగా అధృష్టమని ఎంపీపీ కరణం అరవింద్ రావ్ అన్నారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నజీరాబాద్ తండాలో మంగళవారం లబ్దిదారులకు పింఛన్ ప్రొసిడింగ్ ప్రతాలు, కార్డులను పంపిణీ చేశారు. ఈ సంద్బంగా ఎంపీపీ కరణం అరవింద్ రావ్, ఏఎంసీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్ మాట్లాడుతూ మాట్లాడుతూ
వయస్సు మీదపడగాను చాలా మంది తల్లిదండ్రులను వదిలిపెట్టడం, అనాద ఆశ్రయాలకు తరలించడం చేస్తున్నారన్నరు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చాక పింఛన్ డబ్బులు 2 వేలకు పై చిలుకు చేయడంతో ఆ డబ్బుల ఆశకైనా తల్లిదండ్రులను బాగా చూసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రొయ్యల ఆంజనేయులు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ శివన్నోళ్ల భాస్కర్, సర్పంచులు గణేష్, వెంకట్ రామ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీబాయి లబ్దిదారులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ :
20 పిఆర్ జి 01లో నజీరాబాద్ తండాలో పింఛన్ కార్డులను అందజేస్తున్న ఎంపీపీ, సర్పంచ్ తదితరులు