ఆర్థిక ఇబ్బందులతో మృతి

కమాలాపూర్‌: మండలంలోని మౌటం పోచాలు(40) అనే చిరు వ్యాపారి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక బుధవారం ఉదయం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లీ ఆరోగ్యం బాగు చేయించేందుకు కుటుంబ అవసరాలకోసం రూ.50వేలు అప్పు చేశాడు. అప్పు తీర్చలేక కలత చెంది బుధవారం కమాలాపుర్‌ పెద్ద చెరువు సమీపంలో విషం తాగి మృతి చెందినట్లు బందువులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు.