ఆర్‌విఎం ప్రణాళికలపై రాష్ట్ర పరిశీలకుడు సూచనలు
ఖమ్మం, జనవరి 28 (): రాజీవ్ విద్యామిషన్ ఆధ్వర్యంలో 2013-14 విద్యాసంవత్సరానికి అవసరమైన వార్షిక ప్రణాళికను రాష్ట్ర పరిశీలకుడు సుబ్బారావు పరిశీలించినట్టు జిల్లా రాజీవ్ విద్యామిషన్ పథకం అధికారి వెంకటనర్సమ్మ తెలిపారు. ఆర్‌విఎం క్షేత్ర అధికారులకు, సిబ్బందికి ప్రణాళిక తయారీపై పలు సూచనలు, సలహాలను ఆయన ఇచ్చారన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని విభాగాలను దృష్టిలో ఉంచుకొని వాటిని పూర్తి చేయాలని సూచించారు. అదేవిధంగా అవాస ప్రాంత మండల ప్రణాళికలను దృష్టిలో పెట్టుకోవాలని పరిశీలకుడు వివరించినట్టు ఆమె తెలిపారు. ఖమ్మం జిల్లా తీవ్రవాద ప్రభావిత ప్రాంతంగా ప్రత్యేక జిల్లాగా గుర్తించినందున అన్ని విభాగాల తయారీలో ఆయా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారని సూచించినట్టు వివరించారు.