ఆర్.టి.ఐ కమిషన్ ముందు హాజరైన అధికారులు

బచ్చన్నపేట సెప్టెంబర్ 21 (జనం సాక్షి) జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవలూరు గ్రామపంచాయతీకి సంబంధించిన సమాచారం అధికారులు ఇవ్వనందున రాష్ట్ర సమాచార కమిషన్కు ఫిర్యాదు చేశానని ఆర్టిఐ కార్యకర్త మినలాపురం జలంధర్ అన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో ఆర్టిఐ కింద గ్రామపంచాయతీకి సంబంధించిన సమాచారం సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరగా సంబంధించిన అధికారులు గ్రామపంచాయతీకి వచ్చి విచారణ చేశారు కానీ. విచారణ రిపోర్టులు నిర్ణీత సమయంలో ఇవ్వనందున రాష్ట్ర సమాచార కమిషన్ను కలువగా సమాచార కమిషన్ సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేయగా. బుధవారం అధికారులు కమిషన్ ముందు హాజరైనారని అధికారులపై సమాచారం నిర్ణీత సమయంలో ఎందుకు ఇవ్వలేదని కమిషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తపరచాలని తెలిపారు. ఇకనుంచి అధికారులు సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరగాలని నిర్ణీత సమయంలో సమాచారం ఇచ్చి ప్రజలకు సహకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కమిషన్ ముందు హాజరైన అధికారులు. బచ్చన్నపేట ఎంపీడీవో రఘురామకృష్ణ. సూపరిండెంట్.. కొడవటూరు గ్రామ కార్యదర్శి. జిల్లా పంచాయతీ కార్యాలయం నుండి సీనియర్ అధికారి. మండల టెక్నికల్ అసిస్టెంట్ ఉన్నారు