*ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఓజో ఫౌండేషన్ చైర్మన్ రఘు

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్)

*బుధవారం,మేళ్ళచెరువు:-  మండల పరిధిలోని వెంకట్రాంపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ  కోదండరామ స్వామి ఆలయాన్ని ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ఓజో ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మాట్లాడుతూ దేవుడు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో,అష్ట ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆలయం నిర్మాణంలో దాతగా గ్రానైట్ ఫ్లోరింగ్ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు కమిటీ నిర్వాహకులు భారీ గజమాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ఇంచార్జ్ కుక్కల వెంకన్న, కాకునూరి శివారెడ్డి, బండి అనిల్ రెడ్డి, బేత సాయి రెడ్డి, నరేందర్ రెడ్డి,.            తదితరులు పాల్గొన్నారు*