ఆలయ హుండీని ఎత్తుకెళ్లిన దొంగలు

నల్లగొండ,నవంబర్‌26 (జనంసాక్షి):  జిల్లాలోని కనగల్‌ మండలం చిన్న మాధారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామంలోని రేణుక ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం జరిగింది. ఆలయం గేటు పగులగొట్టిన దుండగులు హుండీని ఎత్తుకెళ్లారు. ఆలయంలో గత రెండు రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. శుక్రవారం హుండీ ఆదాయం లెక్కించాల్సి ఉండగా చోరీ జరిగింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆలయంలోని సీసీ కెమెరాల్లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.