ఆలేరు లో మెగా రక్తదాన శిబిరం

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, ఆలేరు కమ్యూనిటీ హాస్పిటల్ లో మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరిగినది.
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో  రక్తదాన శిబిరాన్ని  జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఎమ్మెల్సీ ఎలిమినేటి  క్రిష్ణా రెడ్డి, భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో  జిల్లా కలెక్టర్ మొట్టమొదటగా రక్త దానము చేశారు.  అలాగే జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర దీపక్ తవారి రక్తదానము చేసి అందరికి స్ఫూర్తిదాయకంగా నిలిచారు.కార్యక్రమములో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. కె. మల్లికార్జున రావు ఆధ్వర్యంలో డి సీ హెచ్ డా. చిన్నానాయక్  సహకారముతో నిర్వహించడం జరిగింది. కార్యక్రమములో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఈ సందర్భంగా మాట్లాడుతూ,  ఒకరి రక్తదానము ఇంకొకరి ప్రాణాలను కాపాడుతుందని,  సరియైన సమయంలో రక్తం అందకపోతే ప్రాణం పోయే ప్రమాదం ఉందని,  ప్రతి ఒక్కరూ రక్తదానము చేయాలని కోరారు.  రక్తం కొరత వలన ఎవరి ప్రాణాలు పోకూడదని,  ప్రతి ఒక్కరూ బాధ్యతగా 3 నెలలకు ఒకసారి రక్త దానము చేయాలని,  దాని ద్వారా వారిలో ఉత్తేజం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమము కొరకు జిల్లాలోని అన్ని పీహెచ్ సీ ల డాక్టర్లు ప్రతి ఒక్కరూ ప్రజలను పోత్సహించి రక్తదాన కార్యక్రమంలో పాలు పంచుకున్నారని, రక్తదాన కార్యక్రమంలో డాక్టర్లు, పోలీసు  వారు కూడా రక్తదానం చేశారని, జిల్లా ఆసుపత్రిలో 75 మంది, కమ్యునిటి హాస్పిటల్ లో 75 మంది రక్తదానం చేసారని, రెండు కేంద్రాలలో రక్తదాన శిబిరాలు విజయవంతం అయ్యాయని అన్నారు.కార్యక్రమములో డి.సి.పి. నారాయణరెడ్డి, భువనగిరి మున్సిపాలిటీ చైర్మన్ ఆంజనేయులు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అమరేందర్ గౌడ్, భువనగిరి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కృష్ణయ్య, కౌన్సిలర్లు, డిప్యూటీ వైద్య ఆరోగ్య అధికారులు డాక్టర్ ప్రశాంత్,  డాక్టర్ యశోద, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పరిపూర్ణాచారి, డాక్టర్ పాపారావు,  డాక్టర్ సుమన్ కళ్యాణ్,  డాక్టర్ వినోద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
 

తాజావార్తలు