ఆల్ఫోర్స్ విద్యార్థులకు గవర్నర్ పురస్కార అవార్డ్స్

 

కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
అల్ఫోర్స్ విద్యార్థులకు ప్రతిష్ఠాత్మక గవర్నర్ పురస్కార అవార్డులు, రాజ్యపురస్కార్ టెస్టింగ్ క్యాంప్ కు ఎంపిక అయినట్లు ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులకు ప్రాథమిక దశ నుండే దేశభక్తి, దేశంలోని సామాజిక విధివిధానాలను తెలియజేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ – టెక్నో పాఠశాలలో ఏర్పాటుచేసిన విద్యార్థుల అభినందన సభకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం పట్ల నిర్వర్తించే భాద్యతలను, దేశ ఔన్నత్యం గురించి విద్యార్థులకు తప్పనిసరిగా తెలియజేయాలని చెప్పారు. దేశం పట్ల కొందరు వ్యవహరిస్తున్న తీరు ఆశాజనకంగా బాధాకరమన్నారు. భారతదేశం అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని , అభివృద్ధి రెట్టింపు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నేటికి భారతదేశంలో సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలని కోరారు. విద్యార్థులలో దేశ భక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో సమజాంలో వ్యవహరిస్తున్న తీరును సమగ్రంగా తెలియజేయాలనే సంకల్పంతో పాఠశాలలో అనుభవర్థులైన శిక్షకులచే సౌట్స్ & గైడ్స్ ను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. ఆల్ఫోర్స్ లో యన్.సి.సి ఉత్తేజంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మరిన్ని స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడుతామని వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన ప్రాంతీయ సదస్సులో పాఠశాలకు చెందిన 5 గురు విద్యార్థులు అత్యుత్తమ ట్రోఫితో పాటు వచ్చే మాసంలో గవర్నర్ ప్రత్యక్ష పర్యావేక్షణలో నిర్వహించే కార్యక్రమానికి బంగారు పతకం, రాష్ట్రపతి రాజ్యపురస్కార్ టెస్టింగ్ క్యాంప్ కు ఆల్ఫోర్స్ విద్యార్థులు ఎంపిక కావడం హర్షించదగ్గ విషయం అన్నారు. ప్రశంసా పత్రం పొందిన వారిలో వి . సంజీతా రెడ్డి , కె . వర్షిణి , ఎ . స్నిగ్ధా శ్రషాంత్ , డి . హంసిని , ఇ . రిషికా రెడ్డి , ఎ . హర్షికా రెడ్డి , జిహానత్ , ఇ , సమంత . వీరందరు త్వరలో నిర్వహించబోయే గవర్నర్ కార్యక్రమ శిక్షణ శిభిరానికి ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ , ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.