ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర మహిళా ఉపాధ్యాయురాలిగా మద్దిమడుగు సైదమ్మ ఎన్నిక

 

 

 

 

 

 

 

 

 

కొండమల్లేపల్లి డిసెంబర్ 12 జనం సాక్షి న్యూస్ :
ఆదివారం హైదరాబాదులోని ఖైరతాబాద్ లో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కార్యాలయంలో జరిగినటువంటి రాష్ట్ర మహిళా నూతన ఎన్నిక కమిటీలో ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర మహిళా ఉపాధ్యాయురాలిగా
నల్గొండ జిల్లా చందంపేట మండలం పెద్దముూల గ్రామానికి చెందినటువంటి మద్దిమడుగు సైదమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.అనంతరం ఆమె మాట్లాడుతూ 1927 లొ డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ చే స్థాపించబడిన ఈ సంస్థలో పనిచేయడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారత దేశ ప్రజల కోసం ఎన్నో హక్కులు కల్పించాడని ఆ హక్కుల కోసం నా వంతుగా నేను కూడా ఈ సంస్థలో భాగంగా ప్రజల పక్షాన, మహిళల పక్షాన పనిచేస్తానని అన్నారు. తన ఎన్నికకు సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.