ఆవిర్భావ వేడుకులు అదిరిపోవాలి

సబ్బండ వర్గాలకు అండగా నిలిచిన కెసిఆర్‌ : విప్‌

యాదాద్రి భువనగిరి,జ‌నం సాక్షి): తెలంగాణను విముక్తి చేసి స్వరాష్ట్రం సాధించిన కేసీఆర్‌ నాలుగేళ్లలో నాలుగున్న కోట్ల తెలంగాణ సబ్బండ వర్గాలు మురిసేలా పాలన అందించారనిఎమ్మెల్యే,ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్‌ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలోనే ఆదర్శవంతంగా నిలిచాయన్నారు. గడిచిన నాలుగేళ్ల పాలనలో ప్రజలంతా సుఖశాంతులతో ఉన్నారని అన్నారు. ముఖ్యంగా రైతన్నలకు, ప్రజలకు నిండుగా కరెంటు ఇచ్చిన సర్కార్‌పట్ల ప్రజలు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని అన్నారు. స్వరాష్టం ఆవిర్భవించిన జూన్‌ 2న నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రంలో జెండాలు ఎగురవేసి పండుగలా ఆవిర్భావ వేడుకులు జరుపుకోవాలని ఆయన కోరారు. మన రాష్ట్రాన్ని మనమే ఏలుకుందాం అనే నినాదంతో సాధించిన తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చి దిద్దే వరకు ప్రతీ ఒక్కరు ముందుకు నడువాల్సిన అవసరం ఉందన్నారు. రైతుల సంక్షేమం కోసం రూ. 17 వేలకోట్ల పంట రుణాలు మాఫీ చేయడంతో పాటు ఆత్మహత్యల నివారణకు రైతన్నకు పంటల పెట్టుబడికి సాయంగా ప్రతీ ఎకరాకు రూ.4 వేలు అందించేలా చర్యలు తీసుకుంటున్నారన్నారు. ప్రజలకు పారదర్శక పాలన అందించారే తప్ప రూపాయి అవినీతి, కుంభకోణం జరుగలేదన్నారు. సంక్షేమంలోనే నంబర్‌వన్‌గా నిలిచి జాతీయ సంస్థల సర్వేల్లో ఆదర్శ సీఎంగా కితాబు పొందారని అన్నారు. ముఖ్యంగారాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు గోదావరి, కృష్ణా జలాలను శుద్ధి చేసి ఇంటింటికి అందించే మిషన్‌భగీరథను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని అన్నారు. స్వరాష్ట్ర సాధనలో కాళ్లకు గజ్జెలు కట్టి ప్రజలకు చైతన్యవంతుల్ని చేసిన కళాకారులు 500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కించదన్నారు. అదేవిధంగా పల్లెల్లో కులవృత్తులకు మళ్లీ పూర్వవైభం తీసుకువచ్చేందుకు వారికి జీవనోపాధి కల్పించే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుంనారన్నారు. గొర్లకాపర్లు, మత్య్సకారులతో పాటు చాకలి, మంగళి, కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వంటి కులాలకు ఉపాది అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేశారన్నారు. గ్రావిూణ ప్రాంతాలు పరిపుష్టిగా అభివృద్ధి సాధించాలన్నదే తమ లక్ష్యమని కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారని అన్నారు.