ఆశాలపై దమన కాండను ఖండించిన తమ్మినేని, చాడా..

9హైదరాబాద్ : ఆశావర్కర్లపై ప్రభుత్వం దమనకాండను కొనసాగిస్తుందని.. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. ఈమేరకు వారు మీడియాతో మాట్లాడారు. నాగేశ్వర్‌ అరెస్ట్, ఆయన పట్ల పోలీసుల ప్రవర్తన దారుణమన్నారు.