,ఆశా,ల టిబి రిజిష్టర్లు పరిశీలించిన
-టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్
గద్వాల ప్రతినిధి అక్టోబర్ 18 (జనంసాక్షి):- రాజోలి మండల కేంద్రము లోని రాజోలి ఏ, బి, సి సబ్ సెంటర్ లను దర్శించి ఆశా వర్కర్లు టిబి రిజిష్టర్ లను రాజోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టిబి సూపర్ వైజర్ జయప్రకాశ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఆశా కార్యకర్త క్షయ వ్యాది గ్రస్తుల యొక్క అన్ని వివరాలు టిబి రిజిష్టర్ లో నమోదు చేయాలని అన్నారు. క్షయ వ్యాది నిర్థారణ పరీక్షలు నిర్వహించిన తరువాత టిబి రోగికి ఏ రిపోర్ట్ లో టిబి పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందీ అనగా ఎక్స్ రే రిపోర్టు, గళ్ళ పరీక్ష లో, సిబినాట్ లో, లేక డిజిటల్ ఎక్స్ రే లనా, దేంట్లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందీ ఆ వివరాలు అన్ని టిబి రిజిష్టర్ లో నమోదు చేయాలని ఆయన సూచించారు. ఏ తేదీ నుండి టిబి మందులను వాడుతున్నారు, లాబ్ నంబర్, నిక్షయ్ ఐ డి నంబర్ , ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ల వివరాలు తప్పకుండా రాయాలని ఆయన మాట్లాడుతూ తెలిపారు. టిబి రోగులకు మందులను ఎలా వాడాలో చెప్పాలని ఆయన చెప్పారు. టిబి రోగుల ఇంటికి వెళ్ళి వారి ఆరోగ్య బాగోగులు అడిగి తెలుసు కోవాలి అని ఆయన అన్నారు. రెండు నెలలు టిబి మందులు వాడిన తరువాత ఫాలో అప్ చేయించాలని, అలా మూడు సార్లు ఫాలో అప్ చేయించాలని ఆయన ఆశా వర్కర్లు కు చెప్పారు, టిబి రోగులు ఒక నెల మందులు వాడిన తరువాత రోగి యొక్క బరువును చూడాలని 6నెలల వరకు అతని బరువు టిబి రిజిష్టర్ లో నమోదు చేయాలని ఆయన అన్నారు…
Attachments area