ఆసరా కార్డులను త్వరిగతిన లబ్ధిదారులకు పంపిణీ చేయాలి

– ఎంపీపీ గూడేపు శ్రీనివాస్
హుజూర్ నగర్ సెప్టెంబర్ 2 (జనం సాక్షి): మండల పరిధిలో గల గ్రామ పంచాయితీలకు కొత్తగా వచ్చిన ఆసరా కార్డులను త్వరితగతిన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఎంపిపి కార్యాలయంలో కార్యాలయ సిబ్బంది పంచాయితీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిపి శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హత ఉండీ ఆసరా పింఛను రాని వారిని గుర్తించి పెన్షన్ వచ్చేలా చూడాలన్నారు. ఆసరా పింఛన్ లబ్ధి దారులకు కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఎంపిడిఓ, ఎంపీఓ పంచాయితీ కార్యదర్శులను అభినందించారు. ఉపాధి హామీ పథకం పకడ్బందీగా అమలు చేయాలని, హరిత హారం లో నాటిన మొక్కలను సంరక్షణ చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ శాంతకుమారి, ఎంపీఓ ఎస్ కే మౌలానా, సూపేరెండెంట్ నర్సిరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ చంద్రకళ, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్, ఏపీఓ శైలజ, పంచాయితీ కార్యదర్శులు, సిబ్బంది  పాల్గొన్నారు.