ఆసరా తో ఆత్మవిశ్వాసం పెంచాం… పేదల ఆత్మీయ బంధువు కెసీఆర్.

 

కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు.

మల్లాపూర్ ,(జనం సాక్షి )సెప్టెంబర్: 10 ఆసరా తో ఆత్మవిశ్వాసం పెంచాం… పేదల ఆత్మీయ బంధువు కెసీఆర్ అని మండలంలోని సాతారం గ్రామంలో జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో శనివారం ఏర్పాటు చేసిన కొత్త పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన అన్నరు.
పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుంటే ప్రభుత్వానికి వచ్చే ఆదరణ చూసి ఓర్వలేని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్ బిజెపి నాయకులకు ప్రభుత్వం అందించే పథకాలు నచ్చడం లేదని తెరాస జిల్లా బాధ్యులు స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. ఈ సందర్భంగా కొత్తదామరాజు పల్లి , నడి కూడా మొగిలిపేట ఓబులాపూర్, సంగెం శ్రీరాంపూర్, ఓబులాపూర్ తండా, పాత దామరాజు పల్లి వాల్గొండ, వాల్గొండ తండా, చిట్టాపూర్ సాతారం గుండంపల్లి రేగుంట గొర్రెపల్లి వేంపల్లి వెంకట్రావు పేట గ్రామాలకు చెందిన 1103 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ ద్వారా మంజూరైన పెన్షన్ ధృవీకరణ పత్రలను, గుర్తింపు కార్డులను అందజేశారు, అదేవిధంగా కల్యాణ లక్ష్మి పథకం ద్వారా నలుగురు లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను, పలువురికి సీఎంఆర్ ద్వారా మంజూరైన చెక్కులను నేరుగా అందజేశారు.
అలాగే సాతారం ప్రభుత్వ పాఠశాలలకు మంజూరైన కోటి 20 లక్షల ప్రోసిడింగ్ సర్పంచ్ సుమలత రాజేష్ లకు అందజేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమ ధ్యేయంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆసరా పెన్షన్ ద్వారా వృద్ధులకు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్ కల్పిస్తూ పెద్ద కొడుకుల కేసీఆర్ ఆదుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల అభ్యున్నతికి పరితపిస్తుంటే ప్రవేశ పెట్టే సంక్షేమ పథకాలు ఉచితలుగా వర్ణిస్తూ ప్రతిపక్ష పార్టీలు, ప్రజలను తప్పుదోవ పట్టించేలా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని వాటన్నిటిని ప్రజలు ఎవరు నమ్మొద్దు అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాలన్నీ సస్య శ్యామలం అయ్యాయని వ్యవసాయం పండగల సాగుతుందన్నారు. బిజెపి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని నిత్యం ప్రజా శ్రేయస్ కోసం పనిచేసేది ప్రభుత్వం ఒక్కటేనని అన్నారు. ప్రభుత్వాలు అంటే ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి తప్ప ఎలక్షన్లకు ముందు వచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి ఆగామాగం చేసే విధంగా ఉండరాదని ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి కాంగ్రెస్ పార్టీల పనితీరు ఇలానే తయారయిందని ఎద్దేవా చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వంచే ఆసరా పథకం ద్వారా సంక్షేమ పథకాలు అందజేస్తామని రానివారు నిరుత్సాహపడుద్దని కోరారు. అనంతరం ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేను శాలువా మాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సరోజన ఆదిరెడ్డి జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి వైస్ ఎంపీపీ గౌరు నగేష్, పిఎసిఎస్ చైర్మన్ మోహన్ రెడ్డి ఏఎంసి తాజా మాజీ చైర్మన్ నరసయ్య వైస్ చైర్మన్ శరత్, సర్పంచులు శ్రీనివాస్ ,నాగరాజు , నరసయ్య,రవి, దిలీప్, సాయికుమార్, భూక్య రజిత రవి, సరిత కమలాకర్ రెడ్డి , గంగు రాజన్న,కళావతి సురేందర్ నాయక్, సుమలత రాజేష్ , మమత రాజేష్, సరోజన నరేష్, సరోజన విష్ణు, మల్లు సంతోష్ యాదవ్, ఎంపీటీసీలు సుజాత నరేష్ రెడ్డి భూమి రాజేందర్, శ్రీనివాస్, ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు. అధికారులు సూపరిండెంట్ వెంకటేశ్వర్లు ,ఎంపీ ఓ జగదీష్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్ రెడ్డి లతోపాటు పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు తదితరులున్నారు