ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొనింటీ మాణిక్ రావు

జహీరాబాద్ సెప్టెంబర్ 11 జనం సాక్షి మండలం లోని దిడిగి, కొత్తుర్ బి, బుర్ధిపాడ్, తుంకుంట, సత్వర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల హయాంలో వృద్ధులకు పింఛన్లు 200 రూపాయలు మాత్రమే ఇచ్చే వారని, కానీ కేసీఆర్‌ సీఎం అయ్యాక పదింతలు పెంచి 2016 రూపాయలు ఇస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి పేదవారికి పెన్షన్‌ తప్పక ఇస్తామ‌న్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేద‌ని, ఇప్పటి వరకు నమోదు చేసుకోని వారు కూడా దరఖాస్తు చేసుకుంటే పింఛన్‌ అందజేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ పెంట రెడ్డీ, మండల అద్యక్షులు ఎంజీ రములు, రైతు సమన్వయ అద్యక్షులు తాజుద్దీన్, సర్పంచ్ ఫోరమ్ అద్యక్షులు శెట్టి రాథోడ్, ఉప సర్పంచ్ ల ఫోరమ్ అద్యక్షులు తట్టు నారాయణ, మండల యువత అద్యక్షులు గోవర్ధన్ రెడ్డి, సొసైటీ డైరెక్టర్ మచ్చందర్, మాజీ జెడ్పీటీసీ మాణిక్యమ్మ, మహిళ అధ్యక్షురాలు సరస్వతి, ఎంపీటీసీ లు శంకర్, సర్పంచు లు రాజు, కరణ్ రాజ్, రాణి అభ్రహo, మాణిక్ రెడ్డీ, నాయకులు సయీద్, విజయ్ రాథోడ్, పర్శురాం, చిన్న సుక్కు, గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.