*ఆసరా పెన్షన్ల పంపిణీ*
కమ్మర్పల్లి 03(జనంసాక్షి): కమ్మర్పల్లి మండల కేంద్రంలో శనివారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసినటువంటి పెన్షన్ కార్డులని లబ్ధిదారులకు కమ్మర్పల్లి సర్పంచ్ గడ్డం స్వామి, టిఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని అభిప్రాయపడ్డారు. అలాగే లబ్ధిదారులు కూడా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగుంట దేవేందర్, కమ్మర్పల్లి ఎంపిటిసి మైలారం సుధాకర్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బద్దం రాజేశ్వర్, బాల్కొండ నియోజకవర్గ సమన్వయ సమితి నెంబర్ హైమద్ , కో ఆప్షన్ నెంబర్ పాషా, టిఆర్ఎస్ నాయకులు సుమన్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.