ఆసియా క్రీడల్లో భారత్ అదరహో
ఆసియా క్రీడల్లో భారత్ అదరహో
ఆసియా క్రీడల్లో భారత్ ఖాతాలోకి మరో స్వర్ణం వచ్చి చేరింది. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో జ్యోతి సురేఖ వెన్నం- ఓజాస్ డియోటలే బంగారు పతకం సాధించారు. ఫైనల్‌లో దక్షిణ కొరియా జట్టును 159-158 తేడాతో భారత్ ఓడించింది. అలాగే 35 కి.మీ మిక్స్‌డ్ వాక్ ఈవెంట్‌లోనూ భారత్ కాంస్య పతకం దక్కించుకుంది. ఈసారి ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు భారత్ సాధించిన పతకాల సంఖ్య 71కి చేరింది. 16 స్వర్ణాలు, 26 రజతాలు, 29 కాంస్య పతకాలు ఉన్నాయి. 2018 ఆసియా క్రీడల్లో భారత్ 70 పతకాలను సాధించింది. ఇప్పటివరకు ఇదే అత్యధికం కావడం విశేషం. ఈసారి వంద పతకాలే లక్ష్యంగా భారత అథ్లెట్లు బరిలోకి దిగారు. 75 కేజీల బాక్సింగ్ కేటగిరీలో లవ్లీనా ఇప్పటికే పతకం ఖాయం చేసుకుంది. జావెలిన్ త్రో ఈవెంట్‌లో నీరజ్ చోప్రాపై భారీగానే అంచనాలు ఉన్నాయి