ఆసియా క్రీడల్లో షూటర్ల దూకుడు
బంగారు,కాంస్య పతకం దక్కించుకున్న క్రీడాకారులు
జకార్తా,ఆగస్ట్21(జనం సాక్షి): ఇండోనేషియా వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత షూటర్లు తమ హవా కొనసాగిస్తున్నారు. భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. పురుషుల 10విూటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఇద్దరు భారతీయులు పతకాలు దక్కించుకున్నారు. 16 ఏళ్ల సౌరభ్ చౌదరి భారత్‌కు షూటింగ్‌లో తొలి స్వర్ణాన్ని అందించాడు. మరో షూటర్ అభిషేక్ వర్మ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 240.7 పాయింట్లతో సౌరభ్ అగ్రస్థానంలో నిలవగా జపాన్‌కు చెందిన టొమోయుకి మసుడా రజతం దక్కించుకున్నాడు. 219.3 పాయింట్లతో అభిషేక్ మూడో స్థానంలో నిలిచాడు. సౌరభ్ ఆసియా గేమ్స్‌లో అత్యధిక పాయింట్లతో రికార్డు కూడా నెలకొల్పాడు. దీంతో ఇప్పటి వరకు ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 7కు చేరింది. ఇందులో 3 స్వర్ణాలు, 2 రజతాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. ఒక్క షూటింగ్‌లోనే భారత్ 5 పతకాలు గెలవడం విశేషం. సౌరభ్ చౌదరీ .. షూటింగ్ ఈవెంట్‌లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకున్నాడు. 10 విూటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్‌లో అతను స్వర్ణ పతకం గెలుచుకున్నాడు. ఇదే ఈవెంట్‌లో మరో షూటర్ అభిషేక్ వర్మ కూడా కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే షూటింగ్‌లో నాలుగు పతకాలు వచ్చాయి. సోమవారం కూడా భారత్ షూటర్లు రెండు పతకాలు తమ ఖాతాలో వేసుకున్నారు. దీపక్ కుమార్, లక్షయ్‌లకు రజత పతకాలు వచ్చిన విషయం తెలిసిందే.షూటర్ సౌరభ్ చౌదరీ వయసు పదహారు ఏళ్లే. మొదటి సారి ఆసియా గేమ్స్ ఆడుతున్న సౌరభ్.. ఫస్ట్ ఈవెంట్‌లోనే గోల్డ్ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. గేమ్స్ చరిత్రలో ఇదో రికార్డు. జపాన్‌కు చెందిన మేటి షూటర్ తొమయుకి మసుదాపై సౌరభ్ విక్టరీ సాధించాడు. గోల్డ్ మెడల్ రౌండ్‌లో సూపర్ షో ప్రదర్శించాడు. లాస్ట్ రౌండ్‌లో చివరి రెండు షాట్లలోనూ 9.8 స్కోర్ చేశాడు. ఆసియా గేమ్స్‌లో సౌరభ్ ఖాతా తెరవడంతో భారత్ స్వర్ణ పతకాల సంఖ్య మూడుకు చేరుకున్నది.