ఆసుపత్రి,వృద్ధాశ్రమాలు,అనాధ శరణాలయాల్లో,జైళ్లలో పళ్ళు పంపిణీ చేసిన జడ్పీ చైర్మన్,కలెక్టర్,అదనపు కలెక్టర్, అధికారులు.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు19(జనంసాక్షి):
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు జరుపుకుంటున్న వేళ ప్రతి ఆసుపత్రిలోని రోగులకు, వృద్ధాశ్రమాలు, అనాధ శరణాలయాల్లో ఉన్న అనాధాలకు, జైళ్లలో ఉన్న ఖైదీలకు  పళ్ళు పంపిణీ కార్యక్రమం ద్వారా పండుగ వాతావరణం నెలకొన్నదని జిల్లా పరిషత్ చైర్మన్ పెద్దపల్లి పద్మావతి అన్నారు.ఈ నెల 8 నుండి 22 వరకు రోజుకో కార్యక్రమం చొప్పున వజ్రోత్సవాలు నిర్వహించుకుంటున్న సందర్బంలో శుక్రవారం జిల్లాలో పళ్ళ పంపిణి కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించారు.ఈ పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని జడ్పి చైర్మన్ తో పాటు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్, అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా అధికారులు, మున్సిపల్ చైర్మన్లు నాగర్ కర్నూల్ నుండి కల్పన, అచంపేట మున్సిపల్ చైర్మన్ నర్సింహ, మార్కెట్ యార్డు చైర్మన్ కృష్ణ నాయక్, కొల్లాపూర్ ఎంపీపీ భోజ్యా నాయక్, ఆర్డీఓలు ఎక్కడికక్కడ పంపిణి చేశారు.  జిల్లాలోని 4 ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లోని 362 మంది రోగులకు, 5 వృద్ధాశ్రమాల్లోని 111 మంది వృద్ధులకు, 3 అనాధ ఆశ్రమాల్లోని 44 మంది అనాధాలకు జైళ్లలోని 22 మంది ఖైదీలకు నేడు పండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.     జడ్పి చైర్మన్ పద్మావతి కొల్లాపూర్ చౌరస్తా లోని అనాధాశ్రయం, జిల్లాలోని జైలు, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదనవు కలెక్టర్ మోతిలాల్ తో కలిసి పండ్ల పంపిణీ చేయగా జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అచ్ఛంపేట ఎస్.ఏ.వి. వృద్ధాశ్రమంలో  వృద్ధులకు, అచ్ఛంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో రోగులకు పండ్ల పంపిణీ చేశారు.  అచ్ఛంపేట వృద్ధాశ్రమంలో   కెలెక్టర్ పండ్లు పంపిణీ చేయగా అక్కడి వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులు ఉత్సాహంగా  పాటలు పాడారు.   కొల్లాపూర్ లో మార్కెట్ కమిటీ చైర్మన్, ఎంపీపీ ఆర్డీఓ కౌన్సిలర్లు పండ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.