ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో మంత్రి డీకే అరుణ భేటీ
న్యూఢిల్లీ: రాష్ట్ర మంత్రి డీకే అరుణతో పాటు పలువురు మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు ఆస్కార్ ఫెర్నాండెజ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్ జిల్లా నేతలు తెలంగాణ పై తమ అభిప్రాయాలు తెలిపారని అన్నారు. వారి అభిప్రాయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకుపోతానని తెలిపినట్టు చెప్పారు. అయితే, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌తో జరిపిన చర్చలపై తానిప్పుడేమీ మాట్లాడలేనని వ్యాఖ్యానించారు. తెలంగాణపై ఏ ప్రకటనైనా కేంద్రం చేస్తుందని వివరించారు.