ఆస్పత్రిలో కోలుకుని.. విధుల్లో చేరిన సూర్యాపేట సీఐ మొగిలయ్య

నల్గొండ: గత నెల ఏప్రిల్‌ 1వ తేదీన నల్గొండ జిల్లా సూర్యాపేట బస్టాండ్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ సూర్యాపేట పట్టణ సీఐ మొగిలయ్య కొలుకుని, తిరిగి విధుల్లో చేరారు. ఆ.. రోజు జరిగిన ఘటనను ఆయన బ్యాడ్‌ డే గా వ్యాఖ్యనించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన తమ సిబ్బందికి మొగిలయ్య నివాళులర్పించారు. వారి సహసాన్ని కొనియాడారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఆ రోజు కూడా సూర్యాపేట బస్టాండ్‌కు వెళ్లామని, అయితే వారు ఉగ్రవాదులని ఊహించలేదని మొగిలయ్య అన్నారు. విధుల్లో చేరిన సీఐ మొగిలయ్యకు పోలీస్‌ సిబ్బంది స్వాగతం పలికారు.