ఆహారభద్రత వివరాలు ఇవ్వండి
సంగారెడ్డి,ఫిబ్రవరి17( (జనంసాక్షి) ): జిల్లాలో ఆహారభద్రత కార్డుల వివరాలను గ్రామ పంచాయతీలు, చౌకధరల దుకాణాలవారీగా వివరాలు అందజేయాలని జేసీ శరత్ అన్నారు. దళితులకు భూ పంపిణీ కార్యక్రమం ముమ్మరం చేయాలన్నారు. దళిత సంఘాలు, గ్రామ సభల ద్వారా మాత్రమే అర్హులను గుర్తించాలని ఆయన సూచించారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు 58 కింద క్రమబద్ధీకరణ కోసం వచ్చిన దరఖాస్తులను ఈనెల 20లోగా అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. దరఖాస్తులను పరిశీలించి త్వరగా అప్‌లోడ్‌చేయాలన్నారు. జహీరాబాద్, సంగారెడ్డి, పటాన్‌చెరు, రామచంద్రాపురం మండలాలు మినహా మిగతా మండలాల తహసీల్దార్లు నిర్ణీత గడువులో ప్రభుత్వం ఇచ్చిన చెక్ మెమో ఆధారంగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదుచేయాలని ఆదేశించారు. జవిూన్ బందీ కార్యక్రమంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలనినాయన సూచించారు. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జిల్లాలో 46,353 మంది బీడీ కార్మికులు ఉన్నారని, వీరికి ఆసరా పింఛన్ల మంజూరుకు అర్హులను గుర్తించాలన్నారు.