ఆహార భద్రత చట్టం పక్కగా అమలుకు పకడ్బందీ చర్యలు..

ఆహారపు అలవాట్లు మార్చుకొని సురక్షితమైన ఆహారం తీసుకొనేలా ప్రచారం నిర్వహించాలి..

 

అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ

హన్మకొండ 14 అక్టోబర్ జనంసాక్షి

ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సందర్భంగా శుక్రవారం నాడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యా రాణీ మాట్లాడుతూ
ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా అందరూ
ఆహారపు అలవాట్లు మార్చుకొని సురక్షితమైన ఆహారం తీసుకొనేలా ప్రచారం నిర్వహించాలన్నారు.
ఆహార భద్రత చట్టం 2013, సెప్టెంబర్ 2013 నుండి అమలులోకి వచ్చిందనీ ఇందులో అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల గ్రామీణ జనాభాలో 75 శాతం , పట్టణ జనాభా లో 50 శాతం సబ్సిడీ రేట్ల పై ఆహార ధాన్యాలు పంపణి చేయడం ద్వారా మొత్తం జనాభాలో దాదాపు మూడింట రెండు వంతుల జనాభా ఇది కవర్ చేస్తుందన్నారు.

ఎఫ్ ఆర్ కె బియ్యం ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ఐరన్ ఫోలీక్ యాసిడ్, విటమిన్ బి 12, ల మైక్రో న్యూాట్రియూఎన్ ట్స్, కలిగిందని సాధారణ బియ్యంలో వంద కిలోలకు 1 కిలో చొప్పన ఎఫ్ఆర్కె మిశ్రమాన్ని కలుపుతారు. దీనికీ వాడకం వల్ల రక్త హీనత నివారించవచ్చని పోషకాలతో కూడిన ఆహార పదార్థములు పంపిణి చేస్తున్నట్లు చెప్పారు.

ప్రభుత్వం ద్వారా గర్భిణీ, మహిళలు, పాలిచ్చే తల్లులు, ప్రసూతి బెనిఫిట్స్, క్రింద ఆరు వేలు పొందుతున్నారని ఆమే అన్నారు.

వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ద్వారా లబ్దిదారులు దేశములో ఎక్కడైనా నిత్యావసర వస్తువులు పొందవచ్చని అన్నారు.
ఎండ్ టూ ఎండ్ కంప్యూటర్ రైజాషన్ ద్వారా సరుకులు రవాణా , పంపిణి చేయడం జరుగుతుందని అన్నారు.

ప్రజలకు ఆహార భద్రత చట్టం పైన అవగాహన కోసం గ్రామ మండల , జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి చట్టం పైన ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

అనంతరం ఆహార భద్రత చట్టం పైన వ్యాస రచన పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేసి,
ఆహార అలవాట్ల పై ప్రత్యేకంగా ప్రచురించిన కరపత్రంను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో కమిటి సభ్యులు
డిఆర్డిఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, డి ఎం హెచ్ ఓ, సాంబ శివ రావు, డిఎస్ఓ వసంత లక్ష్మీ, జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ సబిత, ఆహార భద్రత కమిటి సభ్యులు, ఈవి శ్రీనివాస్ రావు, రతన్ సింగ్, అనిత రెడ్డి, రైస్ మిల్లర్లు ప్రతినిధి వెంకటేశ్వర రావు, దామోదర్, శ్యాం, డిడి బిసి వెల్ఫేర్ రాంరెడ్డి,
డిఎం,డిటి ద్యబ్లుఓ సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.