ఆ డబ్బులు ఎవరి జేబుళ్లోకి వెళుతున్నాయి?

3

– ధరల పెరుగుదలపై నిలదీసిన రాహుల్‌

న్యూఢిల్లీ,జులై 28(జనంసాక్షి):  ధరలపెరుగుదలపై పార్లమెంట్‌ వేదికగా మోదీ పాలనపై  కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. ధరల పెరుగదలపై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. మోదీ అన్నీ తప్పుడు హావిూలు ఇస్తున్నారని ఆరోపించారు. యూపిఎ హయాంలో ధరలను, ప్రస్తుత ధరలను ఆయన వివరిస్తూ మోదీపై నేరుగా విమర్శలు ఎక్కుపెట్టారు. ధరలను నియంత్రించడంలో ప్రధాని మోడీ దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. మేకి/- ఇన్‌ ఇండియా గురించి మాట్లాడుతున్న మోడీ ధరలపై ఎందుకు మాట్లాడరని అన్నాఉ. ఉదాహరణగా కొన్నింటి ధరలను తమ పాలనతో పోల్చి చెప్పారు. రెండేళ్లలో టమాటాల ధర మూడు వందల శాతం పెరిగిందని, పప్పుల ధరలు 120 శాతం పెరిగాయని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. తమ హయాంలో రైతు మద్దతు ధర, మార్కెట్‌ ధరకు మధ్య తేడా 30 రూపాయలని, అదే ఇప్పుడు 130 రూపాయలకు చేరిందని, ఆ పెరిగిన వంద ఎవరి జేబుల్లోకి వెళ్లాయని రాహుల్‌ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో తనను ప్రధానిని కాదు.. విూ సేవకుడిని చేసుకోండన్న మోదీ ఇప్పుడు చేస్తున్నది ఏంటని రాహుల్‌ నిలదీశారు. ఆ సేవకుడి పాత్ర కాంగ్రెసే పోషిస్తుందని అన్నారు. యూపీఏ ప్రభుత్వం ఆరు వేల కోట్ల రైతు రుణాలను మాఫీ చేస్తే.. ఎన్డీయే మాత్రం 1.14 లక్షల కోట్ల పారిశ్రామిక వేత్తల లోన్లు మాఫీ చేశారని ఘాటుగా విమర్శించారు. విూరు పారిశ్రామికవేత్తలను ఎంతైనా ప్రోత్సహించండికానీ.. అదే సమయంలో రైతులను విస్మరించకండని రాహుల్‌ సూచించారు. స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా అంటూ ఎన్నైనా పథకాలు ప్రారంభించండిగానీ.. పప్పులు, టమాటు, ఆలుగడ్డల ధరలు ఎప్పుడు తగ్గుతాయో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ హాయాంలో నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంపై కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ధరలను నియంత్రిస్తామని చెప్పి 2014 సంవత్సరంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని తెలిపారు. కానీ ప్రస్తుతం ఆలూ, టమాట..ఇతరత్రా వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. దేశానికి ప్రధాన మంత్రి చేయవద్దని, దేశానికి కాపలా ఉంటానని ఆనాడు మోడీ పేర్కొన్నారని, ధరలపై మోడీ ఇచ్చిన మాటను తప్పారని తెలిపారు. ప్రస్తుతం పప్పు ధాన్యాలు బ్లాక్‌ మార్కెట్‌ కు తరలుతున్నాయని, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని సభకు తెలిపారు. మేక్‌ ఇన్‌ ఇండియా..స్టార్టప్‌ ఇండియా..అంటూ ఏవో మాట్లాడుతున్నారని, రోజు రోజుకు పెరుగుతున్న ధరలపై మాత్రం మాట్లాడడం లేదని ఎద్దేవా చేశారు. రైతుల విషయంలో యూపీఏ ఎన్నో హావిూలిచ్చి నెరవేర్చిందని, రుణమాఫీ చేయడం కూడా జరిగిందని గుర్తు చేశారు. మేక్‌ ఇన్‌ ఇండియాలో ఒక వ్యక్తికి ఉద్యోగం కల్పించలేదని, ఎలాంటి హావిూలిచ్చారో ఆ హావిూలను నెరవేర్చాలని సూచించారు. ధరలు ఎప్పుడు తగ్గిస్తారో ఒక తేదీని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. మహిళలు, రైతులను మరిచిపోవద్దని రాహుల్‌ గాంధీ సూచించారు.చివరగా దేశంలో ఇప్పుడో కొత్త నినాదం వినిపిస్తోందని, ప్రజలంతా అర్హర్‌ మోదీ.. అర్హర్‌ మోదీ (కందిపప్పు మోదీ.. కందిపప్పు మోదీ) అని నినదిస్తున్నారని చెప్పి రాహుల్‌ తన ప్రసంగాన్ని ముగించారు.