ఆ నిర్ణయం సోమవారం తీసుకుంటాం: ఎర్రబెల్లి
వరంగల్, మార్చి 20: స్పీకర్, ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడంపై సోమవారం నిర్ణయం తీసుకుంటామని టీడీఎల్పీ
నేత ఎర్రబెల్లి దయాకర్ చెప్పారు. తమ నేతలతో మాట్లాడి.. తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ అంశంపై బీజేపీ సభ్యులతోనూ చర్చిస్తామని తెలిపారు. కేసీఆర్ పిట్టలదొరలా మాట్లాడుతున్నారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఓటమి.. సీఎంకు చెంపపెట్టు కావాలన్నారు.